విపిన్ చాలా విషపూరితమైనవాడు : ఉన్నిముకుందన్
ఉన్ని ముకుందన్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో విపిన్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని పేర్కొన్నాడు. మీడియా సంస్థలు వాస్తవాలను ధృవీ కరించుకోవాలని కోరాడు.;
తన మేనేజర్ విపిన్ పై దాడి చేసినట్టు వచ్చిన వార్తలను ఖండిస్తూ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశాడు మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని, విపిన్‌తో ఎప్పుడూ శారీరకంగా గొడవకు దిగలేదని అతడు స్పష్టం చేశాడు. అంతకుముందు రోజు, ఉన్ని విపిన్‌ను దూషించి శారీరక దాడికి దిగినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విపిన్ గాయాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కొచ్చిలో ఉన్నిపై ఫిర్యాదు కూడా నమోదైంది.
అయితే, ఉన్ని ముకుందన్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో విపిన్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని పేర్కొన్నాడు. మీడియా సంస్థలు వాస్తవాలను ధృవీ కరించుకోవాలని కోరాడు. విపిన్‌తో జరిగిన సమావేశం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని.. విపిన్ అసలు తన వ్యక్తిగత మేనేజరే కాదని అతడు క్లారిటీ ఇచ్చాడు. విపిన్‌పై ఉన్ని చేసిన మరో తీవ్ర ఆరోపణ ఏమిటంటే... విపిన్ మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళా నటీమణులను కలిసి, వారిని ఉన్నీని వివాహం చేసు కోవాలని కోరేవాడు. "ఒక మహిళా నటిని నాతో పెళ్లి చేసుకోమని కూడా సంప్రదించాడు. దీని వల్ల మా మధ్య పెద్ద గొడవ జరిగింది" అని ఉన్ని పేర్కొన్నాడు.
విపిన్ మొదటగా 2018లో ఉన్నిని తన హోమ్ బ్యానర్‌లో సినిమా నిర్మించాల నుకున్నప్పుడు కలిశాడు. మలయాళ పరిశ్రమలో ప్రముఖుల పబ్లిసిస్ట్‌గా పరిచయం చేసుకున్న విపిన్.. ఆ సినిమాకు తగిన గుర్తింపు లభించకపోవడంతో ఉన్నితో గొడవపడ్డాడు. "నేను ఎప్పుడూ సహోద్యోగులతో వృత్తిపరమైన సంబంధం మాత్రమే నిర్వహించాను. కానీ ఈ వ్యక్తి చాలా విషపూరితమైనవాడు" అని ఉన్ని పోస్ట్‌లో పేర్కొన్నారు.
విపిన్ తన గురించి పరిశ్రమలో గాసిప్‌లు సృష్టించి, తన ప్రతిష్టను దెబ్బతీసేలా చేశాడని ఉన్ని ఆరోపించాడు. ఈ విషయం తనకు మానసికంగా భారీ ఒత్తిడిని కలిగించిందని చెప్పాడు. నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంతో సంతోషంగా లేని కొందరు వ్యక్తులు ఈ వ్యక్తికి సహాయం చేస్తూ నా కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా కెరీర్‌ను కష్టపడి, పట్టుదలతో నిర్మించుకున్నాను. నేను సత్యంలో నమ్మకం ఉంచుతాను, ఎటువంటి బాధిత బాధనలకు గురైనా" అని ఉన్ని ముకుందన్ తన పోస్ట్‌ను ముగించాడు.