2027లో ప్రారంభం కాబోతున్న టోవినో ‘తంద వైబ్’
2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సినిమా భారీ కాన్వాస్‌పై రూపొందుతోంది.;
డైనమిక్ హీరో టోవినో థామస్ నటించబోతున్న మలయాళ యాక్షన్ చిత్రం ‘తంద వైబ్. ముహ్సిన్ పరారి దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ మూవీకి ఎక్కువ సమయం పట్టనుంది. షూటింగ్ పూర్తిగా థాయ్‌లాండ్‌లో జరగనుంది. 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సినిమా భారీ కాన్వాస్‌పై రూపొందుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ‘తంద వైబ్’ ఒక పోస్టర్‌తో ఈ ప్రాజెక్ట్ గురించి తొలిసారి వార్తలు వచ్చాయి. పోస్టర్‌లో టోవినో డాన్స్ పోజ్‌లో ఉన్న సిల్హౌట్ పోజ్ అందరినీ ఆకట్టుకుంది. ‘తంద వైబ్’ మూవీ టోవినో, ముహ్సిన్‌ల కాంబోలో ‘తల్లుమాల, వైరస్’ చిత్రాల తర్వాత మళ్లీ రూపొందనుండడం విశేషం. ‘తల్లుమాల’ టీమ్‌లోని సినిమాటోగ్రాఫర్ జిమ్షి ఖలీద్, సంగీత దర్శకుడు విష్ణు విజయ్ వంటి కీలక సభ్యులు ఈ చిత్రంలోనూ ఉన్నారు. టోవినోతో ‘కళ, 2018, ఎవరివన్, ఈజ్ ఎ హీరో, ఐడెంటిటీ’ వంటి చిత్రాల్లో పనిచేసిన చమన్ చక్కో ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ముహ్సిన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కెఎల్ 10’ థియేటర్లలో పెద్దగా విజయం సాధించలేదు. కానీ తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టోవినో ఇటీవల అనురాజ్ మనోహర్ రాజకీయ డ్రామా ‘నరివేట్ట’ లో కనిపించారు. ప్రస్తుతం ఆయన డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో ‘పళ్ళి చట్టంబి’ అనే పీరియడ్ డ్రామాలో డ్రాగన్ ఫేమ్ కాయదు లోహర్‌తో కలిసి నటిస్తున్నారు. మరి ‘తంద వైబ్’ ఎలాంటి కథతో తెరకెక్కబోతుందో చూడాలి.