టోవినో థామస్ ‘నరివేట్ట’ విడుదలయ్యేది అప్పుడే !
ఈ సినిమా మే 23న థియేటర్లలోకి రానుంది. మొదట ఈ చిత్రం మే 16న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా మే 23 కు వాయిదా వేసినట్లు చిత్రబృందం తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.;
మాలీవుడ్ డైనమిక్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా "నరివేట్ట". ఈ సినిమా మే 23న థియేటర్లలోకి రానుంది. మొదట ఈ చిత్రం మే 16న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా మే 23 కు వాయిదా వేసినట్లు చిత్రబృందం తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో టోవినో పోలీసు యూనిఫారమ్‌లో.. అల్లర్ల మధ్య నినాదాలు చేస్తూ కనిపించగా, ఇతర పోలీసు అధికారులు మంటల మధ్యగా ముందుకు దూసుకొస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
"ఇష్క్" ఫేమ్ అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్టు, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అబిన్ జోసెఫ్ కథను అందించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా 2003లో కేరళను కుదిపేసిన "ముతంగా ఘటన" ను ప్రేరణగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ ఘటన కేరళ రాజకీయ వ్యవస్థలో అప్పట్లో కలకలం రేపింది. ఈ చిత్రంలో టోవినోతో పాటు సురాజ్ వెంజారాముడు, తమిళ నటుడు, దర్శకుడు చెరన్, ఆర్య సలీం, ప్రియమ్వద కృష్ణన్, రినీ ఉదయకుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక విభాగాల్లో విజయ్ సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ నిర్వహించారు. జేక్స్ బీజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమాను ఇండియన్ ఫిలిం కంపెనీ బ్యానర్‌పై తిప్పు షా మరియు షియాస్ హసన్ కలిసి నిర్మించారు. ఈ సినిమా మే 23న తమిళంలో కూడా విడుదల కాబోతున్నది. మరి ‘నరివేట్ట’ సినిమా టోవినో కు ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.