వైరల్ అవుతోన్న ‘లూసిఫర్’ సీక్వెల్ నుంచి టోవినో లుక్

లూసిఫర్ విడుదలయిన కొద్ది రోజుల తర్వాత ప్రకటించిన ఈ సినిమా సీక్వెల్ గా ‘ఎంపురాన్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.;

By :  K R K
Update: 2025-01-21 08:12 GMT

మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ చిత్రం మాలీవుడ్ లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. లూసిఫర్ విడుదలయిన కొద్ది రోజుల తర్వాత ప్రకటించిన ఈ సినిమా సీక్వెల్ గా ‘ఎంపురాన్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 2023 అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమైంది.

పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి తాజాగా టోవినో థామస్ లుక్ విడుదలైంది. టోవినో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. “అధికారం ఒక మిధ్య” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీలో టోవినో పోషించిన జతిన్ రాందాస్ పాత్రను హైలైట్ చేశారు. ‘లూసిఫర్’ సినిమాలో కొన్ని ముఖ్యమైన సీన్స్ లో కనిపించిన జతిన్ రాందాస్ పాత్ర ‘ఎంపురాన్’ లో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. కేరళ ముఖ్యమంత్రిగా మారిన జతిన్ రాందాస్ ‘ఎంపురాన్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

సుమారు 20 విదేశీ దేశాల్లో సినిమా చిత్రీకరించారని సమాచారం. యుకె, యుఎస్ వంటి ప్రదేశాలకే కాక, రష్యాలో కూడా ఈ సినిమా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. లూసిఫర్లో కనిపించిన పృథ్వీరాజ్, టొవినో థామస్, మంజు వారియర్, ఇంద్రజిత్, బైజు, సానియా అయ్యప్పన్ వంటి నటీనటులు ‘ఎంపురాన్’ లో కూడా ప్రభావవంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబావూర్ ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News