మరో బ్లాక్ బస్టర్ అందుకున్న మోహన్ లాల్

ఇప్పుడు "తుడరుమ్" మూవీతో ప్రేక్షకులను భావోద్వేగ బాటలో నడిపిస్తున్నాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం.. కేరళతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.;

By :  K R K
Update: 2025-04-26 01:32 GMT

ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఎందుకు తనను 'లాలేట్టన్' గా మలయాళ అభిమానులు ఆరాధిస్తారో.. ఇటీవల "ఎల్ 2: ఎంపురాన్" రూపంలో ఇటీవల బాక్సాఫీస్‌ను శాసించి ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు "తుడరుమ్" మూవీతో ప్రేక్షకులను భావోద్వేగ బాటలో నడిపిస్తున్నాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం.. కేరళతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఉదయం వేళ నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు, థియేటర్లలో ఎమోషనల్‌ స్టాండింగ్‌ ఓవేషన్లు .. ఇలా ప్రతి షో కూడా ఒక వేడుకగా మారింది. "దృశ్యం 2" తర్వాత ఆ స్థాయి క్రేజ్ మళ్లీ ఇదే.. అని ఎర్నాకుళంలో ఉన్న ఒక థియేటర్ మేనేజర్ వ్యాఖ్యానించాడు. కుటుంబాలు, అభిమానులు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. థియేటర్‌లో ఒక్కో సీన్‌కు ప్రేక్షకులు ప్రతిస్పందిస్తున్న తీరు, అభిమానం కాదు .. ఆరాధనలా ఉంది.. అన్నాడు.

"ఆపరేషన్ జావా", "సౌదీ వెళ్ళరిక్క" వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు తరుణ్ మూర్తి ఆలోచనల నుంచి పుట్టిన ఈ సినిమా కథ.. నెమ్మదిగా, లోతుగా చెప్పిన కథనంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. మోహన్‌లాల్ నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది. కొంతమంది సినిమాకు చివర్లో కన్నీళ్లు తుడుచుకుంటే.. మరికొందరు కీలక సన్నివేశాల్లో చప్పట్లతో థియేటర్‌ను మోతెక్కించారు. అతను నటించలేదు.. ఆ పాత్రలో జీవించాడు... అంటూ కోళికోడ్ థియేటర్ బయట ఉన్న ఒక అభిమాని భావోద్వేగంగా చెప్పాడు.

సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే ఉత్సాహం, హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ఎమోషనల్ పోస్టులు, ఫ్యాన్ ఆర్ట్స్, సినిమాతో వారి అనుబంధాన్ని పంచుకుంటున్నారు. సినిమా విజయానికి మరో కీలక కారణం .. మోహన్‌లాల్ గత చిత్రాలపై చేసిన సెల్ఫ్ ట్రోలింగ్, సందర్భానుసార హాస్యం. ఇదే సమయంలో ఆయనకు జోడీగా శోభన కనిపించడం, ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతిని ఇచ్చింది.

Tags:    

Similar News