పెళ్లి తర్వాత లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయ్!

Update: 2025-03-03 12:50 GMT

మహానటి కీర్తి సురేష్.. ఇటీవలే ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె తన సినిమా కెరీర్‌లో యాక్టివ్‌గానే కొనసాగుతోంది. తాజాగా, ఆమె వరుణ్ ధావన్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా "బేబీ జాన్" లో కనిపించింది. ఇక ఆఫ్టర్ మ్యారేజ్... కీర్తి సురేష్ లిస్ట్ లో చాలానే సినిమాలు, సిరీసెస్ ఉన్నాయి.

తాజా గా కోలీవుడ్ నుంచి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కథనాల ప్రకారం, కీర్తి సురేష్ త్వరలో అశోక్ సెల్వన్ తో జతకట్టే అవకాశం ఉందట. అయితే, ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఎవరు? సినిమా ఏ జానర్‌లో ఉంటుంది? అనే విషయాలు ఇంకా వెల్లడికాలేదు. ఇంతవరకు నటీనటుల నుంచి అధికారిక ప్రకటన కూడా రాలేదు.

ప్రస్తుతం కీర్తి సురేష్‌కి ఏ తెలుగు సినిమాలు లైనప్‌లో లేవు. కానీ, ఆమె నటించిన "రివాల్వర్ రిటా", వెబ్ సిరీస్ "ఉప్పు కప్పురంబు", "అక్క" విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, వీటి రిలీజ్ డేట్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి.

Tags:    

Similar News