పార్లమెంట్ లో ‘ఎంపురాన్’ పై నిప్పులు చెరిగిన సురేశ్ గోపీ

ఇటీవలే.. కేరళ బీజేపీ ఎంపీ, సినీయర్ హీరో సురేశ్ గోపి.. ‘ఎంపురాన్’ సినిమా ఒక కుట్ర పూరితమైన సినిమాగా వ్యాఖ్యానించారు.;

By :  K R K
Update: 2025-04-05 02:48 GMT

కొన్ని సినిమాలు చాలా అరుదుగా రాజకీయ చర్చలకు దారితీస్తూ, పార్లమెంట్‌ లోకూడా చర్చకు కేంద్ర బిందువవుతుంటాయి. అయితే ‘ఎంపురాన్‌’ విషయంలో ఇప్పుడు ఈ అరుదైన అంశం నిజంగా పెద్ద వివాదాన్ని రేపుతోంది. ఈ సినిమా చుట్టూ ఏర్పడిన గొడవలు సోషల్ మీడియా వేదికగా కాకుండా, పార్లమెంటు వరకు చర్చలకు దారితీశాయి. ఇటీవలే.. కేరళ బీజేపీ ఎంపీ, సినీయర్ హీరో సురేశ్ గోపి.. ‘ఎంపురాన్’ సినిమా ఒక కుట్ర పూరితమైన సినిమాగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే.. ఈ సినిమాలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ముస్లిం ఆధిపత్యాన్ని ప్రోత్సహించే దృశ్యాలు ఉన్నాయన్నది.

ఈ సినిమా రీ-సెన్సార్ విషయమై మాట్లాడిన సురేశ్ గోపి.. మేకర్స్‌పై ఎలాంటి ఒత్తిడీ పెట్టలేదని, వారు స్వచ్ఛందంగానే కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేసి మళ్లీ చూపించారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వారి నిర్ణయమని, ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకపోయినప్పటికీ, వారు మరిన్ని వివాదాలు రాకుండా చూసేందుకు చేసిన చర్యలని చెప్పారు. మరోవైపు, వటకర కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ మాత్రం మరో కోణాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రకారం.. సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన కుటుంబంపై నెపం వేసిన దాడుల కారణంగా బలవంతంగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిలో పడిపోయారని తెలిపారు. ఈ సినిమా మీద వచ్చిన విమర్శలు, దాడులు మన దేశంలో వ్యక్తి స్వేచ్ఛను ప్రశ్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని అన్నారు.

ఈ సినిమాపై వచ్చిన ప్రధానమైన విమర్శలలో ఒకటి.. ఇందులో ముస్లిం ఆధిపత్యాన్ని చూపించడం, హిందూ అల్లర్లను ప్రతికూలంగా చూపించడం వంటివి ఉన్నాయి. అందుకే ఈ సినిమా జాతీయస్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడా రెండు వర్గాలుగా విడిపోయారు. ‘ఎంపురాన్’ సినిమాతో మన దేశంలో సినిమాల స్వేచ్ఛ, రాజకీయ రంగ ప్రవేశం, సామాజిక స్పందనలు అన్నింటిపై మళ్లీ ఓ కొత్త చర్చ మొదలైంది అనడంలో అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News