ఈ వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ !

18 ఏళ్ల విరామం తర్వాత తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ఆమె తిరిగి వచ్చిన తీరు పవర్ ఫుల్! సినిమా భారీ విజయం సాధించడమే కాక, ఆమె పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.;

By :  K R K
Update: 2025-05-18 05:54 GMT

ఈ తరం యూత్ కు పెద్దగా తెలియకపోయినా... ఓ వెండి తెర అద్భుతం శోభన. మలయాళ సుందరి అయినప్పటికీ, తెలుగువారికీ ఆమె అంటే ప్రత్యేకమైన ప్రేమ. 1980, 90వ దశకాలలో ఆమె సౌత్ స్క్రీన్‌ను ఓ రేంజ్‌లో అలరించింది. క్లాసికల్ డ్యాన్స్‌ కు కేరాఫ్ అడ్రెస్ అయిన శోభన, కేవలం మాటలతోనే కాదు... కళ్లతో భావాలు పలికించే అరుదైన నటి. ఆమె నటనలో ఓ నిగూడత, ఓ క్లాస్ ఉంటుంది.

బిగ్ స్క్రీన్‌పై తళుక్కుమనడం ప్రారంభించి దాదాపు ఇండియా వ్యాప్తంగా ఉన్న టాప్ హీరోలందరితో నటించిన ఘనత శోభన సొంతం. అయితే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఆమె నటనకు విరామం చెప్పి, తన హృదయానికి అత్యంత దగ్గరైన క్లాసికల్ డ్యాన్స్ వైపు మొగ్గు చూపింది.

30 ఏళ్లు దాటగానే క్యారెక్టర్ రోల్స్‌కు షిఫ్ట్ అయిపోయే ట్రెండ్ ఉన్న సమయంలోనూ, శోభన 40 ప్లస్, 50 ప్లస్ వయసులోనూ కథానాయికగా స్క్రీన్‌పై మెరిసి, ‘వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే’ అని నిరూపించింది. 18 ఏళ్ల విరామం తర్వాత తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ఆమె తిరిగి వచ్చిన తీరు పవర్ ఫుల్! సినిమా భారీ విజయం సాధించడమే కాక, ఆమె పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.

కేవలం తెలుగులోనే కాదు... మలయాళ చిత్ర పరిశ్రమలోనూ ‘తుడరుమ్’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో మళ్లీ మోహన్‌లాల్‌తో జోడీ కట్టి మాయ చేసింది శోభన. సాదాసీదాగా, కానీ అంతే గాఢతతో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20 రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు సాధించి మలయాళ సినిమా చరిత్రలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇలా వరుస హిట్స్‌తో ఆమె మళ్లీ టాప్ లెవల్‌లోకి వచ్చి, తన తరం నటీమణులందరికీ ప్రేరణగా నిలుస్తోంది. నటన, నాట్యం రెండింటినీ సమానంగా మలిచిన శోభనకు ఈ ఏడాది పద్మ భూషణ్ పురస్కారం లభించింది. అది ఆమె నైపుణ్యం, కృషికి సముచిత గౌరవం. భవిష్యత్తులోనూ శోభన నుంచి మరిన్ని అద్భుతాల్ని చూడాలనే అభిలాష ప్రతి సినీ ప్రేమికునికీ ఉంటుంది. ఆమె చూపిస్తున్న ప్రొఫెషనలిజం, గ్రేస్, డెడికేషన్ నిజంగా ఆమెను ఒక కల్ట్ ఐకాన్‌గా నిలిపాయి.

Tags:    

Similar News