తండ్రి పాత్రలకు టర్న్ అయిన రవిచంద్రన్

Update: 2025-02-27 11:04 GMT

తండ్రి పాత్రలకు టర్న్ అయిన రవిచంద్రన్

శాండల్ వుడ్ నటుడు, దర్శకుడు రవిచంద్రన్ నిన్న మొన్నటి వరకూ హీరో పాత్రతో సమానమైన ప్రధాన పాత్రల్లోనే నటించేవాడు. అయితే ఇప్పుడు ఆయన రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. డైరెక్ట్ గా తండ్రి పాత్రల్లోకి షిఫ్ట్ అయ్యాడు. దర్శకుడు సుప్రీత్ రూపొందిస్తున్న "ప్యార్" చిత్రంలో రవిచంద్రన్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. ఎస్‌ఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగశ్రీ నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రేమ, త్యాగం, తండ్రి-కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని హృద్యంగా చాటిచెప్పనుంది.

ఈ భావోద్వేగంతో నిండిన కథలో రవిచంద్రన్‌కు తోడుగా, ప్రధాన పాత్రల్లో కొత్త నటీనటులు భరత్, రషిక శెట్టి కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి తన అనుభూతులను వ్యక్తం చేస్తూ, రవిచంద్రన్ అన్నారు, "ఈ సినిమా కోసం మిగతా టీమ్ నన్ను సంప్రదించినప్పుడు, వారి ప్రేమ, ఉత్సాహం చూసి ఎంతో ఆనందపడ్డాను. అదే ప్రేమతో ఈ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాను. నిజమైన ప్రేమ, అది కోరుకునే త్యాగాన్ని ఈ సినిమా అందంగా చిత్రీకరించనుంది. ఇందులో నేను కథానాయిక తండ్రిగా నటిస్తున్నాను అని రవిచంద్రన్ చెప్పాడు.

ఇప్పటికే ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. "తండ్రికూతుళ్ళ బంధంలోని లోతును ఈ చిత్రం ఆవిష్కరించబోతోంది. కూతురి ప్రేమ, తన తండ్రి కోసం చేసే త్యాగమే ప్రధానాంశంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో తండ్రి, కూతురు మధ్య ప్రేమానుబంధాన్ని ఎంత అందంగా ఆవిష్కరించారో చూడటానికి సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Tags:    

Similar News