నివీన్ పాలీ తో 'ప్రేమలు' డైరెక్టర్!

Update: 2025-07-08 04:10 GMT

నివీన్ పాలీ తో 'ప్రేమలు' డైరెక్టర్!గత సంవత్సరం భారీ విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’. దీని తర్వాత, దర్శకుడు గిరీష్ ఎ.డి. తన తదుపరి ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ‘ప్రేమలు’ చిత్రం అనేక భాషలలో ప్రశంసలు పొందింది, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ విజయం నేపథ్యంలో ‘ప్రేమలు' సీక్వెల్‌పై ఊహాగానాలు వచ్చినా, గిరీష్ ఎ.డి. ఇప్పుడు పూర్తి కొత్త కథతో తన తదుపరి సినిమానుప్రారంభించ బోతున్నాడు.

ఈ కొత్త చిత్రంలో ప్రముఖ నటుడు నివిన్ పాలి హీరోగా నటించనుండగా, మమిత బైజు కథానాయికగా ఎంపికయ్యారు. ఇది కూడా ప్రేమకథనే కావడం విశేషం, ‘ప్రేమలు’ చిత్రాన్ని ఇష్టపడ్డ ప్రేక్షకులకు ఇది మరో మధురమైన అనుభవాన్ని అందించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని ఫహద్ ఫాసిల్, దిలీష్ పొథన్, శ్యామ్ పుష్కరణ్ లు తమ నిర్మాణ సంస్థ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ టీమ్ లో అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ నిర్వహించనుండగా, సంగీతాన్ని విష్ణు విజయ్ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఆకాష్ జోసెఫ్ వర్గీస్ చేపడుతున్నారు.

చిత్రీకరణను త్వరలో ప్రారంభించేందుకు టీమ్ సన్నద్ధమవుతుండగా, ఒకే షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గిరీష్ – నివిన్ పౌలి – మమిత బైజు కాంబినేషన్‌కు సంబంధించిన ఈ నూతన ప్రేమకథపై అభిమానులలోనే కాకుండా సినీ పరిశ్రమలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News