నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన మలయాళ థ్రిల్లర్ !

తెలుగులో ఈ చిత్రం మార్చి 14న విడుదల కాగా... కేవలం వారానికే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రావడం విశేషం.;

By :  K R K
Update: 2025-03-20 04:49 GMT

సూపర్ హిట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ "ఆఫీసర్ ఆన్ డ్యూటీ" నేటి (మార్చి 20) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

ఫిబ్రవరి 20న మలయాళంలో విడుదలైన ఈ మూవీ థియేటర్లలో భారీ హిట్‌గా నిలిచింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ చిత్రం మార్చి 14న విడుదల కాగా... కేవలం వారానికే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రావడం విశేషం.

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా, ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో.. రూపొందిన "ఆఫీసర్ ఆన్ డ్యూటీ" చిత్రానికి జితూ అష్రఫ్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అందుబాటులోకి రావడంతో క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులు దీన్ని తప్పక ఆస్వాదించవచ్చు.

Tags:    

Similar News