మోహన్ లాల్ కొత్త చిత్రం అనౌన్స్ మెంట్ వచ్చేసింది !

Update: 2025-02-21 04:30 GMT

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఈ సంవత్సరం అనేక చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న 'తుడరుమ్', పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న 'ఎంపురాన్', సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహిస్తున్న 'హృదయపూర్వం' వంటి చిత్రాలు 2025లో విడుదల కానున్నాయి. ఇవే కాకుండా.. మోహన్‌లాల్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇది నటుడు, దర్శకుడు అనూప్ మీనన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.




 


అనూప్ మీనన్ ఈ చిత్రానికి కథను అందించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నారు. మోహన్‌లాల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. దానితో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిత్రంపై ఒక చిన్న నోట్‌ను కూడా పంచుకున్నారు. ఈ చిత్రం ప్రేమ, విరహం, సంగీతం కలిసిన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతోంది. తిరువనంతపురం, కోల్‌కతా, షిల్లాంగ్ వంటి ప్రదేశాల్లో ప్రధానంగా చిత్రీకరణ జరగనుంది.




 


అనూప్ మీనన్ కథతో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రెండవ చిత్రం ఇది. 2008లో విడుదలైన 'పగల్ నక్షత్రంగళ్' అనూప్ మీనన్ కథతో రూపొందిన మొదటి మోహన్‌లాల్ చిత్రం. ఇప్పటివరకు అనూప్ మీనన్ ఇరవైకి పైగా చిత్రాలకు కథను అందించారు. 2022లో విడుదలైన 'కింగ్ ఫిష్' అనూప్ మీనన్ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం.

ప్రస్తుతం, మోహన్‌లాల్ సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో 'హృదయపూర్వం' చిత్రంలో నటిస్తున్నారు. 2015లో విడుదలైన 'ఎన్నుం ఎప్పోళుం' ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చివరి చిత్రం. మోహన్‌లాల్. సత్యన్ అంతిక్కాడ్ కలిసి పనిచేస్తున్న ఇది 20వ చిత్రం. ఇవి కాకుండా కన్నప్ప, వృషభ, రామ్', మహేష్ నారాయణన్ చిత్రం వంటి అనేక ప్రాజెక్టులు మోహన్‌లాల్ చేతిలో ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎంపురాన్' మార్చ్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News