మోహన్ లాల్ నెక్స్ట్ మూవీ టీజర్ వచ్చేస్తోంది !
మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ మూవీనే ‘లూసిఫర్ 2: ఎంపురాన్’.;
ప్రపంచాన్ని శాసించిన మాఫియా అధినేతగా మారిన స్టీఫెన్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘లూసిఫర్’. దీనికి సీక్వెల్ రాబోతోంది. మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ మూవీనే ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. ప్రస్తుతం ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ‘‘మా ఆశీర్వాద్ సినిమాస్ సంస్థకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో ‘లూసిఫర్ 2’ టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సీక్వెల్‌ను మునుపటి కన్నా రెండింతల యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం,’’ అని పృథ్వీరాజ్ వెల్లడించారు.
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025 మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ తో మోహన్‌లాల్ అభిమానులు మరోసారి అద్భుత అనుభూతిని పొందేందుకు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సీక్వెల్ మొదటి భాగాన్ని మించి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.