ఆకట్టుకుంటోన్న మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ టీజర్ !

లూసిఫర్ పాత్రలో మోహన్‌లాల్ స్టీఫెన్ నెడుంబల్లి (అబ్రహం ఖురేషి) గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.;

By :  K R K
Update: 2025-01-27 00:13 GMT

2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సౌత్ సినిమాల్లో  ‘L2: ఎంపురాన్’ ఒకటి.  ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. కొచ్చిలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ టీజర్‌ను ఆవిష్కరించారు. లూసిఫర్ పాత్రలో మోహన్‌లాల్ స్టీఫెన్ నెడుంబల్లి (అబ్రహం ఖురేషి) గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను విభ్రాంతికి గురిచేసే అత్యద్భుత దృశ్యకావ్యంగా ఉండబోతోందని టీజర్‌ ద్వారా స్పష్టమైంది. రెండు నిమిషాలు ఇరవై మూడు సెకండ్ల పాటు కొనసాగే ఈ టీజర్‌లో ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. వీటిలో మోహన్ లాల్ అద్భుతమైన స్వాగ్ అండ్ అగ్రెసివ్ నెస్ అభిమానుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.

టీజర్‌లో ప్రధాన పాత్రధారులైన పృధ్విరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్ పాత్రల గురించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు. దీని వల్ల అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. అయితే జతిన్ రామ్‌దాస్ గా టోవినో పాత్ర టీజర్‌ రీసెంట్ గా రిలీజై.. సంచలనాన్ని రేపుతోంది. మరోవైపు జయెద్ మసూద్ గా పృధ్విరాజ్ పాత్ర చివరిభాగంలో పరిచయం అవుతుంది. మంజు వారియర్ పాత్రను మాత్రం పూర్తిగా రహస్యంగా ఉంచారు. ఇది 2019 బ్లాక్‌బస్టర్ లూసిఫర్ సీక్వెల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.

ఇతర ప్రధాన నటుల్లో ఇంద్రజిత్ సుకుమారన్, సానియా అయ్యప్పన్, అర్జున్ దాస్, సాయికుమార్, సూరజ్ వెంజారమూడు, సచిన్ ఖేడేకర్, బైజు సంతోష్ ఉన్నారు. ఈ చిత్రం ఐదు భాషల్లో 2025 మార్చి 27న విడుదల కాబోతోంది.

Tags:    

Similar News