ఓటీటీలోకి మోహన్ లాల్ ‘ఎంపురాన్’
"ఎంపురాన్" చిత్రం 2025 ఏప్రిల్ 24వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.;
మలయాళంలో సంచలన విజయం సాధించిన యాక్షన్ చిత్రం "ఎల్2 ఎంపురాన్". ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది. ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ప్రతిభావంతుడైన స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. బ్లాక్‌బస్టర్ "లూసిఫర్" చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది.
ఇక "ఎంపురాన్" చిత్రం 2025 ఏప్రిల్ 24వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఓటీటీ విడుదలపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ అధికారిక ప్రకటన సోషల్‌మీడియాలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.
2025లో విడుదలైన అతి పెద్ద సినిమాల్లో "ఎంపురాన్" ఒకటి. భారీ తారాగణం, అద్భుతమైన నిర్మాణ విలువలు, అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. థియేటర్లలో విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికలపై కూడా కలకలం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఇంక ఏ రేంజ్ లో సెన్సేషన్ అవుతుందో చూడాలి.