‘ఎంపురాన్’ ఆరోపణలపై స్పందించిన మోహన్ లాల్
‘ఎంపురాన్’ చిత్రం హిందూ వ్యతిరేక అంశాలను ప్రోత్సహించింది అన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో, మోహన్‌లాల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వివాదంపై స్పష్టీకరణ ఇచ్చారు.;
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎంపురాన్’ చిత్రం మలయాళ సినీ ప్రేమికులందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన చిత్రంగా చెప్పవచ్చు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా... ముఖ్యంగా మలయాళీ ప్రేక్షకుల్లో భారీ విజయం సాధించింది. అయితే, ఈ సినిమాపై ఓ రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. ‘ఎంపురాన్’ చిత్రం హిందూ వ్యతిరేక అంశాలను ప్రోత్సహించింది అన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో, మోహన్‌లాల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వివాదంపై స్పష్టీకరణ ఇచ్చారు.
"లూసిఫర్ ఫ్రాంచైజీ రెండో భాగమైన ‘ఎంపురాన్’ చిత్రంలోని కొన్ని రాజకీయ, సామాజిక అంశాలు నా అభిమానుల్లో నిరాశ కలిగించాయన్న విషయం నాకు తెలిసింది. ఒక కళాకారుడిగా, నా సినిమాల్లో ఏ రాజకీయ భావజాలానికీ, ఏ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి ద్వేషాన్ని ప్రోత్సహించకూడదనే బాధ్యత నాకుంది. అందుకే, ఎంపురాన్ టీమ్ తరఫున, మేము నా అభిమానులకు మానసిక క్షోభ కలిగించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిపై ఈ బాధ్యత ఉంటుందన్న అర్థంతో, ఈ వివాదాస్పద అంశాలను చిత్రంలోని నుండి తొలగించాలనే నిర్ణయానికి మేము వచ్చాము.
నా 40 ఏళ్ల సినీ జీవితాన్ని మీ అందరిలో ఒకరిగా గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా అసలైన బలం. మోహన్‌లాల్ అనే వ్యక్తిని మీ ప్రేమ కన్నా పెద్దదిగా నేను ఎప్పుడూ భావించను అని తెలిపారు మోహన్ లాల్. ఈ ప్రకటనతో మోహన్‌లాల్ ఈ వివాదంలో ఇంకేం పడిపోకుండా, ప్రేక్షకుల మనోభావాలను గౌరవించాలనే ఉద్దేశంతో క్లారిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.