వైరల్ గా మారిన మోహన్ లాల్ యాడ్

మోహన్‌లాల్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. విన్స్‌మెరా కొత్త ప్రకటనలో మోహన్‌లాల్ స్త్రీలక్షణాలతో కూడిన హీరో పాత్రలో నటించి.. వారి ఆభరణాలను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు.;

By :  K R K
Update: 2025-07-21 00:51 GMT

సాధారణంగా.. జ్యువెలరీ బ్రాండ్‌ల ప్రకటనల్లో నటీమణులు లేదా మహిళా మోడల్స్ బంగారు లేదా డైమండ్ నెక్లెస్‌లను అందంగా ప్రదర్శిస్తూ కనిపిస్తారు. కానీ.. విన్స్‌మెరా జ్యువెల్స్ తమ ఆభరణాలను ప్రమోట్ చేయడానికి ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. వారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. విన్స్‌మెరా కొత్త ప్రకటనలో మోహన్‌లాల్ స్త్రీలక్షణాలతో కూడిన హీరో పాత్రలో నటించి.. వారి ఆభరణాలను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ ప్రకటనను ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్‌మేకర్ ప్రకాష్ వర్మ డైరెక్ట్ చేశారు. ఆయన ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడరుం’ సినిమాలో విలన్‌గా నటించి తన నటనా రంగ ప్రవేశం చేశారు. ఈ యాడ్‌లో మోహన్‌లాల్ తన సొంత పాత్రలోనే కనిపిస్తూ.. సెట్స్ నుండి ఆభరణాలను దొంగిలించి, తన కారవాన్‌లో వాటిని ధరించే సన్నివేశం చిత్రీకరించారు.

కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, జోస్ అలుక్కాస్ వంటి ఇతర జ్యువెలరీ బ్రాండ్‌లు కూడా పురుష అంబాసిడర్‌లను కలిగి ఉన్నప్పటికీ.. వారు ఎప్పుడూ ఇలాంటి విభిన్నమైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఈ జెండర్ ఫ్లూయిడ్ యాడ్‌తో విన్స్‌మెరా అందరి దృష్టిని ఆకర్షించింది.

మలయాళ చిత్రసీమలో మోహన్‌లాల్ కంటే ఈ పాత్రను ఇంత అద్భుతంగా పోషించగలిగిన వారు మరెవరూ ఉండరు. ఈ రోజుల్లో స్టార్స్ హైపర్ మాస్కులైన్ రోల్స్ కోసం పోటీపడుతున్న సమయంలో, మోహన్‌లాల్ ఇలాంటి వైవిధ్యమైన పాత్రను ఎంచుకోవడం హృదయపూర్వకంగా ఉందని అందరూ ఫీలవుతున్నారు. ఇది ఆయన “కంప్లీట్ యాక్టర్” అనే బిరుదును నూటికి నూరుశాతం సార్ధకం చేస్తోంది. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, మోహన్‌లాల్ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News