మోహన్ లాల్- మమ్ముట్టి మల్టీస్టారర్ కు టైటిల్ ఇదే !
ఈ సినిమా టైటిల్‌ను మోహన్‌లాల్ ఓ శ్రీలంక మీడియా ఇంటర్వ్యూలో రివీల్ చేయడం విశేషం. సినిమా పేరు ‘పేట్రియాట్’.;
ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ శ్రీలంకలో తన లేటెస్ట్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మరో సూపర్‌స్టార్ మమ్మూట్టీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను మోహన్‌లాల్ ఓ శ్రీలంక మీడియా ఇంటర్వ్యూలో రివీల్ చేయడం విశేషం. సినిమా పేరు ‘పేట్రియాట్’. ఇంతకు ముందు తాత్కాలికంగా ‘యంయంయంయన్’ అని పిలుచుకున్న ఈ సినిమా.. ఇప్పుడు అఫీషియల్‌గా ‘పేట్రియాట్’ గా లాక్ అయింది.
“మేము ఓ మెగా సినిమా చేస్తున్నాం. స్టార్ కాస్ట్ విషయంలో ఇది టోటల్ గ్రాండ్‌గా ఉంటుంది. సినిమా టైటిల్ పేట్రియాట్...” అని మోహన్‌లాల్ ఇంటర్వ్యూలో సూపర్ ఎక్సైట్మెంట్‌తో చెప్పారు. శ్రీలంక గురించి మాట్లాడుతూ, అక్కడి కల్చర్, లొకేషన్స్‌ను ఆకాశానికెత్తేశారు. “షూటింగ్‌కి శ్రీలంక సూపర్ ఫ్రెండ్లీ ప్లేస్. ఇక్కడి సీనరీ చూస్తే కేరళలా అనిపిస్తుంది.. ” అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కేవలం శ్రీలంకలోనే కాదు, ఇండియా, అజర్‌బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్‌లలో కూడా జరుగుతోంది.
ఇక సినిమా కాస్టింగ్ విషయానికొస్తే.. ఇది టోటల్ పవర్‌హౌస్. మమ్మూట్టి, మోహన్‌లాల్‌తో పాటు ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి, దర్శన రాజేంద్రన్, జరీన్ షిహాబ్, గ్రేస్ ఆంటోనీ లాంటి స్టెల్లార్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇంతటి భారీ కాస్ట్ ఒకే సినిమాలో రావడం రియల్‌గా బిగ్ డీల్. ఈ సినిమా విజువల్‌గా కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని ఫిక్స్. ఈ సినిమాను ఆంటో జోసెఫ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది మలయాళ ఇండస్ట్రీలో మరో ఐకానిక్ మూవీ అవుతుందని చెబుతున్నారు.