మోహన్ లాల్ సరికొత్త రికార్డు !
కేవలం ఐదు నెలల్లోనే, ‘ఎంపురాన్, తుడరుమ్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు 2025 ఓణం సందర్భంగా ‘హృదయపూర్వం’ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.;
ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఈ ఏడాది ఒక ప్రత్యేక రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్ని థియేటర్లలో విడుదలచేసిన మోహన్‌లాల్... మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే, ‘ఎంపురాన్, తుడరుమ్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు 2025 ఓణం సందర్భంగా ‘హృదయపూర్వం’ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ‘ఎంపురాన్’ సినిమా మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకున్నప్పటికీ, మోహన్‌లాల్ విమర్శల మధ్యలోనూ హైలైట్‌గా నిలిచాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కేరళలో భారీ ఓపెనింగ్‌ను సాధించి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
మరోవైపు.. ఇటీవల విడుదలైన ‘తుడరుమ్’ సినిమా కేరళలో ఒక్కటే 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. ఇది ఆ రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా నిలిచింది. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా బాగా ఆడింది. అలాగే తెలుగులోనూ విడుదలైంది. ఈ రెండు సినిమాలతో అభిమానులు సంతోషంగా ఉండగా, మోహన్‌లాల్ తాజాగా ఎక్స్ వేదికగా ‘హృదయపూర్వం’ మూవీ చిత్రీకరణ పూర్తయినట్లు ప్రకటించాడు.
కేవలం 8 నెలల్లో మోహన్‌లాల్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకవేళ ‘హృదయపూర్వం’ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వరుసగా మూడు హిట్‌లను సాధించిన మొదటి సీనియర్ నటుడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇంతకుముందు మలయాళంలో మమ్ముట్టి ఇలాంటి ఘనత సాధించగా.. దక్షిణ భారతదేశంలో లేదా భారతదేశంలో మరే సీనియర్ హీరో ఇంత వేగంగా సినిమాలను థియేటర్లకు తీసుకురాలేదు. దటీజ్ మోహన్ లాల్.