మమ్ముట్టి సినిమా విడుదల వాయిదా !

Update: 2025-02-06 10:06 GMT

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తాజా చిత్రం 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ '. ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన పొందలేకపోయింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని నమోదు చేసింది. అయితే, ఈ మాలీవుడ్ స్టార్ త్వరలో మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. సినిమా పేరు బజూకా. ఈ సినిమా విడుదల తేదీని ఆఫీషియల్ గా ప్రకటించారు.

అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. డీనో డెనిస్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ అ డ్వెంచర్ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలను ఏప్రిల్-మే 2025కి ఆడ్జస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

బజూకా విడుదల తేదీపై చిత్ర బృందం జనవరి 4న అధికారిక ప్రకటన విడుదల చేయగా, ఇప్పుడు కొత్త తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబు అంటోని, నీతా పిళ్లై, గాయత్రి అయ్యర్, షైన్ టామ్ చాకో, మైమ్ గోపీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక మమ్ముట్టి నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించింది. సినిమా మొదట మిశ్రమ స్పందన పొందినప్పటికీ, వారం రోజుల తర్వాత కాస్త కిందికి పడిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 18 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ నేపథ్యంలో బజూకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మమ్ముట్టికి మంచి హిట్ అందిస్తుందా లేదా అనే విషయంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News