మమ్ముట్టి ‘బజూకా’ కు కౌంట్ డౌన్ బిగిన్స్

Update: 2025-03-12 02:36 GMT

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన అప్ కమింగ్ మూవీ ‘బజూకా’ కొత్త పోస్టర్‌ను రివీల్ చేశారు. 2023లో ప్రకటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అనేక ఆలస్యాల తర్వాత ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడిగా డినో డెన్నిస్ పరిచయమవుతున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.



మమ్ముట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టర్‌లో తన పవర్ ఫుల్ లుక్‌తో కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఇండస్ట్రియల్ ఏరియా ఉండగా.. లాంగ్ హెయిర్ , గుబురు గడ్డంతో, కళ్లజోడుతో ఉన్న ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై ‘హిట్టింగ్ స్క్రీన్స్ ఇన్ 30 డేస్’ అనే టెక్స్ట్ హైలైట్ అవుతోంది. క్యాప్షన్‌గా మమ్ముట్టి "30 డేస్ టు గో ఫర్ ‘బజూకా’.. హిట్టింగ్ స్క్రీన్స్ వరల్డ్‌వైడ్ ఆన్ ఏప్రిల్ 10" అని రాశారు.

నిజానికి ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. తరువాత ఏప్రిల్‌కు మారింది. 2024 ఆగస్టు 15న విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి విశేష స్పందనను అందుకుంది. దీనివల్ల ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది మమ్ముట్టి నటించిన రెండో థియేట్రికల్ రిలీజ్ ఇదే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో జనవరి 23న విడుదలైన ‘డోమినిక్ అండ్ ద లేడీస్ పర్స్’ అనే ఇన్వెస్టిగేటివ్ కామెడీ చిత్రంలో చివరిసారి కనిపించారు. ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినప్పటికీ, మమ్ముట్టి పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి.

‘బజూకా’ చిత్రంలో బాబూ ఆంటోనీ, ఈశ్వర్య మీనన్, నీతా పిళ్ళై, గాయత్రి అయ్యర్, ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మమ్ముట్టి శైలి యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News