ఒకే ఒక్క సినిమాతో అవకాశాల వెల్లువ !
‘ప్రేమలు’ సినిమా మలయాళ చలనచిత్ర రంగంలో అతి పెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. పైగా, తెలుగులోను, తమిళంలోను డబ్ అయిన ఈ సినిమా మంచి క్రిటికల్ యాక్లేమ్‌ను కూడా సంపాదించింది. వివిధ భాషల ప్రేక్షకులు మమిత నటనకు మక్కువ చూపించారు.;
‘ప్రేమలు’ సినిమాతో మమిత బైజు ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది. ఈ ప్రేమకథా హాస్యచిత్రం కేవలం మలయాళ ప్రేక్షకులనే కాదు, ఇతర భాషల ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. ఇందులో ఆమె పోషించిన రీనూ రాయ్ పాత్ర మమిత నటనా జీవితానికి కీలక మలుపుగా నిలిచింది. ఒక్కసారిగా ఆమె పేరు ప్రతి ఇంట్లో వినిపించేటంతగా మారిపోయింది.
‘ప్రేమలు’ సినిమా మలయాళ చలనచిత్ర రంగంలో అతి పెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. పైగా, తెలుగులోను, తమిళంలోను డబ్ అయిన ఈ సినిమా మంచి క్రిటికల్ యాక్లేమ్‌ను కూడా సంపాదించింది. వివిధ భాషల ప్రేక్షకులు మమిత నటనకు మక్కువ చూపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నీ ఆమెపై ప్రశంసల వర్షంతో నిండిపోయాయి. ఈ స్పందన ఆమెను మరింత వెలుగులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం మమిత "‘ప్రేమలు 2" చిత్రంతో బిజీగా ఉంది. మరోవైపు, ఆమెకు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమల నుంచి భారీగా అవకాశాలు వచ్చిపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి కెరీర్ మలుపును నిర్దేశించగల కొన్ని ప్రధాన ప్రాజెక్టులుు ఆమె పైప్ లైన్ లో ఉన్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో మమితకు మరింత గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఇది. స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ఆమె ఓ తమిళ చిత్రంలో కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు "పోర్ తొళిల్" ఫేమ్ విజ్ఞేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత ఇషారి కె. గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మమిత గతంలో "రెబెల్" చిత్రంతో తమిళంలో అడుగుపెట్టినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఆమెకు నిజమైన తమిళ సినీ రంగ ప్రవేశంగా భావించవచ్చు. ధనుష్‌తో జోడీగా ఆమె నటిస్తున్న ఈ సినిమా సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి హైప్‌ను సృష్టించింది. తమిళనాట మమితకు ఇది మెయిన్‌స్ట్రీమ్ గుర్తింపునిచ్చే చిత్రంగా మారే అవకాశముంది. అలాగే.. మరో స్టార్ హీరో సూర్య, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబో మూవీ లో మమితా బైజును హీరోయిన్ గా అఫీషియల్ గా ఫిక్స్ చేశారు. ఇంకా.. రాబోయే మరిన్ని సినిమాల ద్వారా మమిత మరింత పుంజుకుని సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారనుండడం ఖాయం.