మలయాళంలో మరో సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేస్తోంది !
కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో.. సీనియర్ హీరోయిన్ ప్రియమణి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ “ఆఫీసర్ ఆన్ డ్యూటీ”.;
మలయాళ స్టార్ హీరో .. కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో.. సీనియర్ హీరోయిన్ ప్రియమణి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ “ఆఫీసర్ ఆన్ డ్యూటీ”. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను జనవరి 17న సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు.
షాహి కబీర్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రంలో.. జగదీష్, విశాక్ నాయర్, మనోజ్ కే.యు, శ్రీకాంత్ మురళి, ఉన్ని లాలు, రమ్జాన్, మరికొంతమంది కొత్త నటులు కూడా నటిస్తున్నారు. “కన్నూర్ స్క్వాడ్” దర్శకుడు రోబీ వర్గీస్ రాజ్ సినిమాటో గ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఛామన్ చక్కో ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు . ఈ చిత్రాన్ని మార్టిన్ ప్రక్కాట్ ఫిలిమ్స్, ది గ్రీన్ రూమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లు గతంలో “ప్రణయ విలాసం” చిత్రానికి కలిసి పని చేశాయి.
దర్శకుడు జీతు అష్రఫ్ ఇంతకు ముందు “యాక్షన్ హీరో బిజు,” “ఉదాహరణం సుజాత,” “ఇల వీళా పూంచీర” చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. అలాగే “నాయాట్టు,” “ఇరట్ట” వంటి చిత్రాల్లో నటనతో గుర్తింపు పొందారు. కుంచాకో బోబన్ చివరిసారిగా అమల్ నీరద్ దర్శకత్వం వహించిన “బోగన్ విల్లా” మూవీలో నటించగా.. ప్రియమణి “మైదాన్” హిందీ చిత్రం లో అజయ్ దేవగణ్‌తో కలిసి నటించారు.