నస్లెన్ , కళ్యాణి జోడీగా ‘లోక’ మలయాళ ఫాంటసీ చిత్రం
‘తరంగం’ ఫేమ్ డొమినిక్ అరుణ్ రచన మరియు దర్శకత్వంలో.. ‘లోక: చాప్టర్ వన్: చంద్ర’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.;
‘ప్రేమలు, జింఖానా’ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న హీరో నస్లెన్, క్రేజీ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ జోడీగా ఓ యాక్షన్ ఫాంటసీ మూవీ రూపొందుతోంది. దాని పేరు లోక. ‘తరంగం’ ఫేమ్ డొమినిక్ అరుణ్ రచన మరియు దర్శకత్వంలో.. ‘లోక: చాప్టర్ వన్: చంద్ర’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ పోస్టర్లో కల్యాణి ప్రియదర్శన్ కేప్ అండ్ కంబాట్ గేర్‌లో ఫైరీ లుక్‌లో, బర్నింగ్ బ్యాటిల్ఫీల్డ్పై డాగర్‌తో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె వెనుక నస్లెన్ అరుస్తూ.. సాయుధ దళాలు యుద్ధంలో నిమగ్నమై, నీటితో, నిప్పుతో, ధ్వంసంతో నిండిన బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాడు.
‘లోక: చాప్టర్ వన్: చంద్ర’ సినిమా లో ఇంకా.. చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, విజయరాఘవన్, రఘునాథ్ పలేరి, సరత్ సభ, నిత్య శ్రీ, నిషాంత్ సాగర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ నిమిష్ రవి, ఎడిటింగ్ చమన్ చాక్కో, మ్యూజిక్ జేక్స్ బిజోయ్, యాక్షన్ కొరియోగ్రఫీ యానిక్ బెన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నటుడు దుల్కర్ సల్మాన్ తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ ఈ సినిమాలో చిన్న కామియో రోల్స్‌లో కనిపించే అవకాశం ఉంది.