తొలగించిన సురేశ్ గోపీ థ్యాంక్యూ కార్డ్ !
ఈ వివాదాల మధ్య.. కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపికి కృతజ్ఞతలు తెలిపే థ్యాంక్యూ కార్డు చిత్రంలో నుండి తొలగించారు. మొదట.. ఈ చిత్రానికి ప్రత్యేకంగా సురేశ్ గోపికి ఓ టైటిల్ కార్డు ఉంచారు.. కానీ తాజా మార్పుల్లో అది లేకుండా చేశారు.;
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన "L2: ఎంపురాన్" మార్చి 27, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం తీవ్ర వివాదాల్లో చిక్కుకోవడంతో మేకర్స్ భారీగా 24 కట్స్ చేశారు. ఈ వివాదాల మధ్య.. కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపికి కృతజ్ఞతలు తెలిపే థ్యాంక్యూ కార్డు చిత్రంలో నుండి తొలగించారు. మొదట.. ఈ చిత్రానికి ప్రత్యేకంగా సురేశ్ గోపికి ఓ టైటిల్ కార్డు ఉంచారు.. కానీ తాజా మార్పుల్లో అది లేకుండా చేశారు.
సంపూర్ణంగా 2 నిమిషాలు 8 సెకన్ల నిడివిని కత్తిరించిన మేకర్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మ్యూట్ చేయడం, మళ్లీ ఎడిట్ చేయడం, అలాగే కొన్ని డైలాగ్‌లను కత్తిరించడం చేశారు. ఈ సినిమా విడుదలైన వెంటనే కొన్ని ప్రతిపక్ష సంస్థలు సినిమా కథపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య, మోహన్‌లాల్ సోషల్ మీడియా ద్వారా ఓ క్షమాపణ లేఖ కూడా పోస్ట్ చేశారు. తాను ఇలాంటి వివాదాల్లో ఇరికించబడటాన్ని ఇష్టపడనని, ఆ వివాదాలను ఉపేక్షించడమే మంచిదని అందులో పేర్కొన్నారు.
చిత్ర నిర్మాత ఆంథోని పెరంబవూర్, ఈ మార్పులు రాజకీయ ఒత్తిడికి లోబడి చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో "L3: ద బిగినింగ్" తప్పకుండా తెరకెక్కుతుందని ధృవీకరించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన "L2: ఎంపురాన్", 2019లో విడుదలైన "లూసిఫర్" చిత్రానికి కొనసాగింపుగా వచ్చింది. ఈ సినిమా కేరళ రాజకీయాల రూపురేఖలు మారిన తరుణాన్ని చూపిస్తుంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, రిక్ యూన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.