మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కేరళకుట్టి సినిమాలు !

Update: 2025-02-22 05:30 GMT

పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లతో మనకు పరిచయమైన అనుపరమ పరమేశ్వరన్, కాలం మారితే నటనా ప్రాధాన్యతను మార్చుకోవాల్సిందే అని నిరూపించింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి మధురమైన పాత్రలతో మెప్పించిన ఆమె, ఆ తర్వాత చిన్న హీరోలు, కొత్త యాక్టర్లతో చేసిన సినిమాల వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. అయితే.. గ్లామర్ యాడ్ చేయకపోతే అవకాశాలు రావు అన్న సత్యాన్ని గుర్తించిన ఈ కేరళ కుట్టీ.. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి తనలోని గ్లామర్ యాంగిల్ ను ఓపెన్ చేసింది.

అనూను గతంలో డీసెంట్ పాత్రల్లో చూడ్డం అలవాటైన ఫ్యాన్స్.. ఆమె మేకోవర్‌ను చూసి షాక్ అయినా.. సినీ ప్రపంచం మాత్రం ఆమె కొత్త యాంగిల్ ను అంగీకరించింది. టిల్లు స్క్వేర్ సక్సెస్‌తో అవకాశాల వర్షం మొదలైంది. ఇప్పుడు అనుపమకు ఆరు క్రేజీ ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.

లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ సరసన ‘డ్రాగన్’ సినిమా చేసిన అనుపమా. తమిళంలో ధ్రువ్ విక్రమ్‌తో ‘బైసన్’, మలయాళంలో ‘పెట్ డిటెక్టివ్’, ‘లాక్‌డౌన్’ సినిమాలు చేస్తోంది. తెలుగులో ప్రస్తుతం ఆమె చేస్తున్న ఏకైక మూవీ ‘పరదా’. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేసిన ఈ సినిమా సోషియో డ్రామా కానుంది. ప్రవీణన్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి ఈ మలయాళ కుట్టీ కొత్త దారులు వెతుక్కుంటూ మల్టీ ఇండస్ట్రీ యాక్ట్రస్‌గా ఎదుగుతున్నందుకు అభినందించాలి!

Tags:    

Similar News