ఫహద్ ఫాజిల్ కొత్త చిత్రం ‘ఓడుమ్ కుదిర చాడుమ్ కుదిర’

వారి ప్రేమకథ పర్ఫెక్ట్‌.. కానీ పెళ్లివరకు మాత్రమే" అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్‌లో..శేర్వానీ ధరించి తెల్లగుర్రంపై ఫహద్ ఫాజిల్ శుభప్రదంగా కనిపిస్తున్నాడు. దీనికి మంచి స్పందన లభిస్తోంది.;

By :  K R K
Update: 2025-04-16 07:31 GMT

ఫహద్ ఫాసిల్ నటిస్తున్న "ఓడుమ్ కుదిర చాడుం కుదిర " (పరిగెట్టే గుర్రం గెంతే గుర్రం) సినిమా ఫస్ట్ లుక్‌ని మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి ప్రేమకథ పర్ఫెక్ట్‌.. కానీ పెళ్లివరకు మాత్రమే" అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్‌లో..శేర్వానీ ధరించి తెల్లగుర్రంపై ఫహద్ ఫాజిల్ శుభప్రదంగా కనిపిస్తున్నాడు. దీనికి మంచి స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం ఒక రొమాంటిక్ కామెడీగా రూపొందుతోంది. దర్శకుడిగా ఆల్తాఫ్ సలీం రెండో ప్రయత్నమిది. ఆయన 2017లో నివీన్ పాలీ ప్రధాన పాత్రలో నటించిన "న్యండుకలుడే నాట్టిల్ ఒరిడవేళ" సినిమాతో మంచి ప్రారంభం చేశాడు. ఈ సినిమాలో రేవతి పిళ్లై, ధ్యాన్ శ్రీనివాసన్, బాబు ఆంటోనీ, జానీ ఆంటోనీ, లక్ష్మీ గోపాలస్వామి, వినీత్ వాసుదేవన్, సాఫ్‌బోయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఫహద్ ప్రస్తుతం తమిళంలో వడివేలుతో కలిసి నటించిన "మారీసన్" సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ సినిమా జూలైలో థియేటర్లలోకి రానుంది. ఇంకా .. డెబ్యూటెంట్ రాయ్ దర్శకత్వంలో "కరాటే చంద్రన్", మహేష్ నారాయణన్ రూపొందిస్తున్న మల్టీస్టారర్ "ఎమ్ ఎమ్ ఎమ్ ఎన్" (ఇందులో మమ్ముట్టి, మోహన్‌లాల్ కూడా ఉన్నారు), అలాగే రెంజి ఫనిక్కర్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయబోతున్నారు.

తెలుగులో ఫహద్ ప్రాజెక్టులైన "ఆక్సిజన్", "డోంట్ ట్రబుల్ ద ట్రబుల్" పైన కూడా ఆసక్తికర అంచనాలున్నాయి. ఫహద్ అభిమానులకు ఇది నిజంగా జోష్ పెంచే టైమ్. పెళ్లి నేపథ్యంలో కలసిరాని ప్రేమ, హాస్యం, హడావుడి.. ఇవన్నీ కలబోసిన ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News