‘ఎంపురాన్’ సీక్వెల్ గా ‘యల్ 3 : ది బిగినింగ్’

ఎంపురాన్ సీక్వెల్ ‘L3: ది బిగినింగ్’ అనే టైటిల్‌తో రానుంది. స్టీఫెన్ నెడుంపల్లిగా పేరుగాంచిన ఖురేషీ అబ్రామ్ పాత్రలో మోహన్‌లాల్ మరింత పవర్‌ఫుల్ అవతారంలో కనిపించనున్నారు.;

By :  K R K
Update: 2025-03-27 13:15 GMT

కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘L2: ఎంపురాన్’ ఎట్టకేలకు నేడు... మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. అయితే... వీరికి ఊహించని స్థాయిలో సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం విడుదలైనప్పుడే మూడో భాగాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సీక్వెల్ ‘L3: ది బిగినింగ్’ అనే టైటిల్‌తో రానుంది. స్టీఫెన్ నెడుంపల్లిగా పేరుగాంచిన ఖురేషీ అబ్రామ్ పాత్రలో మోహన్‌లాల్ మరింత పవర్‌ఫుల్ అవతారంలో కనిపించనున్నారు. క్రైమ్, యాక్షన్, థ్రిల్ కలగలిసిన కథాంశంతో ఇది ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... చైనా మాఫియాతో జరిగే పోరాటం. అంతర్జాతీయ నేర ప్రపంచాన్ని ప్రభావితం చేసే ‘షెన్ డ్రాగన్’ అనే చైనా గ్యాంగ్‌ను ఈ కథలో కీలకంగా చూపించనున్నారు.

ఇందులో కొత్త విలన్ ఎంట్రీ లూసిఫర్ యూనివర్స్‌కు కొత్త డైమెన్షన్‌ను తీసుకురానుంది. అంతేకాదు, స్టీఫెన్ నెడుంపల్లి ఎలా ఖురేషీ అబ్రామ్‌గా మారాడు? అతడి గతం ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను కూడా ‘L3: ది బిగినింగ్’ లో పూర్తి వివరంగా చూపించనున్నారు. దీంతో ఈ చిత్రం హై వోల్టేజ్ డ్రామాతో పాటు మిస్టరీ, యాక్షన్ ఎలిమెంట్స్‌ కలగలిసిన అద్భుతమైన అనుభూతిని అందించనుంది. మరి ఎల్ 3 ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News