‘ఐయామ్ గేమ్’ షూట్ లో జాయిన్ కానున్న దుల్కర్

దుల్కర్ మొదటి రెండు షెడ్యూల్స్‌లో పాల్గొనలేదు. అతడు కొచ్చిలో జరిగే తదుపరి షెడ్యూల్‌లో చేరతాడు. ఈ చిత్రంలో దుల్కర్‌తో పాటు ఆంటోనీ వర్గీస్ కూడా నటిస్తున్నాడు.;

By :  K R K
Update: 2025-07-06 08:40 GMT

దుల్కర్ సల్మాన్ తన కొత్త మలయాళ చిత్రం ‘ఐయామ్ గేమ్’ షూటింగ్‌లో ఆగస్టులో చేరనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మే మొదట్లో తిరువనంతపురం, హైదరాబాద్‌లో మొదలైనప్పటికీ, దుల్కర్ మొదటి రెండు షెడ్యూల్స్‌లో పాల్గొనలేదు. అతడు కొచ్చిలో జరిగే తదుపరి షెడ్యూల్‌లో చేరతాడు. ఈ చిత్రంలో దుల్కర్‌తో పాటు ఆంటోనీ వర్గీస్ కూడా నటిస్తున్నాడు. అతని సన్నివేశాలు మొదటి రెండు షెడ్యూల్స్‌లో ఎక్కువగా చిత్రీకరించారు.‘ఐయామ్ గేమ్’ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. అతడు.. యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్డీఎక్స్’ తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.

‘ఐయామ్ గేమ్’ చిత్రం కూడా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. క్రికెట్.. కథాంశంలో కీలక భాగంగా ఉంటుంది. సజీర్ బాబా, బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబక్కర్ సంయుక్తంగా స్క్రిప్ట్ రాశారు. ఆదర్శ్ సుకుమారన్ మరియు షహబాస్ రషీద్ సంభాషణలు రాశారు. ఈ చిత్రంలో తమిళ నటదర్శకుడు మిస్కిన్, కదిర్, సంయుక్త విశ్వనాథన్ కూడా నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళంతో పాటు, ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. దుల్కర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తమిళ పీరియాడిక్ ఫిల్మ్ ‘కాంత’, తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా మరో తెలుగు సినిమా కూడా లైన్ లో ఉంది. అలాగే, సౌబిన్ షాహిర్ దర్శకత్వంలో ఒక మలయాళ చిత్రం కూడా ఆయన లైనప్‌లో ఉంది.

Tags:    

Similar News