దుల్కర్ ‘ఐయామ్ గేమ్’ రెండో షెడ్యూల్ పూర్తి
మొదటి షెడ్యూల్‌ను తిరువనంతపురంలో చిత్రీకరించిన ఈ టీమ్.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కంప్లీట్ చేసింది. ఆంటోనీ వర్గీస్ రెండు షెడ్యూళ్లలోనూ సెట్స్‌పై యాక్టివ్‌గా ఉండగా.. దుల్కర్ సల్మాన్ ఇంకా షూటింగ్‌లో జాయిన్ కాలేదు.;
మాలీవుడ్ క్రేజీ హీరోస్ దుల్కర్ సల్మాన్ , ఆంటోనీ వర్గీస్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా ఐ’మ్ గేమ్. తాజాగా ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. మొదటి షెడ్యూల్‌ను తిరువనంతపురంలో చిత్రీకరించిన ఈ టీమ్.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కంప్లీట్ చేసింది. ఆంటోనీ వర్గీస్ రెండు షెడ్యూళ్లలోనూ సెట్స్‌పై యాక్టివ్‌గా ఉండగా.. దుల్కర్ సల్మాన్ ఇంకా షూటింగ్‌లో జాయిన్ కాలేదు.
‘ఆర్డీఎక్స్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నహాస్ హిదాయత్ ఈ సినిమాకు డైరెక్టర్. ఐ’మ్ గేమ్ ఒక ఫుల్-ఆన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది, అందులో స్పోర్ట్స్ థీమ్ కూడా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్... కథలో సెంట్రల్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది. అందుకే, స్పోర్ట్స్ సీన్స్‌ను పర్ఫెక్ట్‌గా తెరకెక్కించడానికి ప్రముఖ స్పోర్ట్స్ కొరియోగ్రాఫర్ రాబ్ మిల్లర్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. ఈ సినిమా క్రికెట్ సీన్స్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.
తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. సినిమా టోగ్రఫీని జిమ్షి ఖలీద్ హ్యాండిల్ చేస్తున్నాడు. సంగీతం జేక్స్ బిజోయ్. ఐ’మ్ గేమ్ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ , జోమ్ వర్గీస్ కలిసి వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానుంది, ఇది పాన్-ఇండియా ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నట్లు సిగ్నల్ ఇస్తోంది. ఈ మల్టీ-లింగ్వల్ రిలీజ్‌తో ఐ’మ్ గేమ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోందని అనిపిస్తోంది.