మోహన్ లాల్ ను అభినందించిన చిరంజీవి

భారతీయ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్ ఎంపికైనట్లు ప్రకటించిన వెంటనే, చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.;

By :  K R K
Update: 2025-09-21 09:33 GMT

మెగాస్టార్ చిరంజీవి... మలయాళ లెజెండ్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం లభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్ ఎంపికైనట్లు ప్రకటించిన వెంటనే, చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వారిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పాత ఫోటోను పంచుకుంటూ చిరంజీవి ఇలా రాశారు... “నా ప్రియమైన మోహన్‌లాల్.. ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ నటన భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. ఇది నిజంగా మీకు దక్కిన గొప్ప గుర్తింపు..’’

ఈ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మోహన్‌లాల్‌కు లభించిన గౌరవంతో పాటు, ఈ ఇద్దరు దిగ్గజాల స్నేహాన్ని కూడా అభిమానులు ప్రశంసించారు. తమ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న నటులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, గౌరవించుకోవడం ఎంత అద్భుతమైన విషయమో ఈ పోస్ట్ చాటి చెప్పిందని నెటిజన్లు కామెంట్ చేశారు. 



Tags:    

Similar News