నిర్మాణ రంగంలోకి బేసిల్ జోసెఫ్
ఈ సంస్థ లక్ష్యం.. కథలను “మరింత బెటర్‌గా, బోల్డ్‌గా, కొత్త పద్ధతుల్లో” అందించడమని వివరించాడు. లోగో అండ్ యానిమేషన్‌ను పవి శంకర్ డిజైన్ చేశాడు.;
మలయాళ యంగ్ హీరో, దర్శకుడు బేసిల్ జోసెఫ్ తన కొత్త నిర్మాణ సంస్థ ‘బేసిల్ జోసెఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ ను తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించాడు. ఈ ప్రకటనతో పాటు ఒక యానిమేటెడ్ వీడియోను కూడా షేర్ చేశాడు. “ఇంతకు ముందు ఎప్పుడూ చేయని ప్రయత్నం ఇది...” అని బేసిల్ ఈ కొత్త వెంచర్ గురించి చెప్పాడు. ఈ సంస్థ లక్ష్యం.. కథలను “మరింత బెటర్‌గా, బోల్డ్‌గా, కొత్త పద్ధతుల్లో” అందించడమని వివరించాడు. లోగో అండ్ యానిమేషన్‌ను పవి శంకర్ డిజైన్ చేశాడు.
తాజా సమాచారం ప్రకారం... బేసిల్ జోసెఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మొదటి సినిమా కోసం.. ‘మిన్నల్ మురళి’, ‘పడయోట్టం’ రచయిత అరుణ్ అనిరుద్ధన్ దర్శకత్వ ప్రవేశం చేయవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, బేసిల్ జోసెఫ్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు.
బాసిల్ తన కెరీర్‌ను 2013లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో ‘తిర’ సినిమాతో అసిస్టెంట్‌గా ప్రారంభించాడు. 2015లో ‘కుంజిరామాయణం’ తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘గోధ’, ‘మిన్నల్ మురళి’ వంటి చిత్రాలతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా స్థిరపడ్డాడు. నటుడిగా కూడా ‘జోజి’, ‘జాన్. ఈ. మ్యాన్’, ‘జయ జయ జయ జయ హే’, ‘పాల్తు జాన్వర్’, ‘ఫాలిమీ’, ‘నునక్కుళి’, ‘సూక్ష్మదర్శిని’, ‘పొన్మాన్’ వంటి సినిమాల్లో సహాయక, ప్రధాన పాత్రల్లో పేరు తెచ్చుకున్నాడు.