సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘బజూకా’

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ గురించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.;

By :  K R K
Update: 2025-04-06 13:43 GMT

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఎర్లియర్ గా ‘డోమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ అనే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీనికి సంబంధించిన ఓటీటీ విడుదలలో ఇంకా స్పష్టతలో లేదు. అయితే... అభిమానులను మరోసారి అలరించేందుకు మమ్ముట్టి సిద్ధమయ్యారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘బజూకా’ ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని డీనో డెన్నిస్ తన దర్శకత్వ అరంగేట్రంగా తెరకెక్కి స్తున్నాడు. తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ గురించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. సినిమాపై మోస్తరుగా హైప్ ఉంది కానీ ప్రమోషనల్ కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా జరగాల్సిన అవసరం ఉంది.

‘బజూకా’ చిత్రాన్ని యూడ్లీ ఫిలిమ్స్ మరియు థియేటర్ ఆఫ్ డ్రిమ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏసీపీ పాత్రలో నటిస్తున్నారు. అతడితో పాటు నీతా పిళ్లై, బాబు ఆంటోని, ఐశ్వర్యా మీనన్, గాయత్రి అయ్యర్, దివ్యా పిళ్లై ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం సయీద్ అబ్బాస్ అందించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News