ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న ఆసిఫ్ ఆలీ చిత్రం
‘ఆభ్యంతర కుట్టవాళి’ (డొమేస్టిక్ క్రిమినల్) చిత్రం చివరకు చట్టపరమైన సమస్యలను అధిగమించి జూన్ 6న రిలీజ్ కానుంది.;
మలయాళ స్టార్ హీరో అసిఫ్ అలీ నటించిన ‘ఆభ్యంతర కుట్టవాళి’ (డొమేస్టిక్ క్రిమినల్) చిత్రం చివరకు చట్టపరమైన సమస్యలను అధిగమించి జూన్ 6న రిలీజ్ కానుంది. మొదట ఏప్రిల్ 3న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. తర్వాత ఏప్రిల్ 17కి వాయిదా పడింది. అయితే, నిర్మాణంలో ఆర్థిక అక్రమాల ఆరోపణల కారణంగా ఆ షెడ్యూల్ కూడా కుదరలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగడంతో, ఈ శుక్రవారం సినిమా సజావుగా విడుదల కానుంది.
సేతునాథ్ పద్మకుమార్ రచన, దర్శకత్వంలో తొలిసారి రూపొందిన ఈ సామాజిక డ్రామా, ఓ యువకుడు వరకట్నం కోసం భార్యను వేధించిన ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న కథాంశం చుట్టూ తిరుగుతుంది. కొత్త నటి తులసి హీరోయిన్గా నటిస్తుండగా, జగదీష్, హరిశ్రీ అశోకన్, ప్రేమ్ కుమార్, సిద్ధార్థ్ భరతన్, అజీస్ నెడుమంగడ్, విజయకుమార్, బాలచంద్రన్ చుల్లిక్కాడ్, ఆనంద్ మన్మథన్, నీరజ రాజేంద్రన్ సహాయ పాత్రల్లో కనిపిస్తారు.
ఈ సినిమాకి సినిమాటోగ్రాఫీ అజయ్ డేవిడ్ కచ్చప్పిల్లి నిర్వహించగా, ఎడిటర్ గా సోబిన్ కె. సోమన్, సంగీత దర్శకులు బిజిబాల్, ముత్తు, రాహుల్ రాజ్ (బ్యాక్గ్రౌండ్ స్కోర్) ఉన్నారు. నైసం సలాం ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమా ఆసిఫ్ ఆలీకి ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.