మాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ !
క్రైమ్ థ్రిల్లర్లు బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడం కొత్తేమీ కాదు. ‘దృశ్యం’ వంటి మలయాళ చిత్రాలు ఈ జానర్‌కు కొత్త ఊపునిచ్చాయి. ఇప్పుడు మరో మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ కూడా అదే దిశగా దూసుకుపోతుంది. రెండో వారం లోనూ ఈ చిత్రం తన స్థిరమైన హోల్డ్‌ను కొనసాగిస్తూ బాక్స్ ఆఫీస్‌ను ఆకర్షిస్తోంది. ఈ చిత్రం కూడా ‘దృశ్యం’ తరహా కల్ట్ హిట్ అవుతుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చెప్తాయి.
విడుదలైన తొలి ఆరు రోజుల్లోనే కేరళలో ₹12.45 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, వర్కింగ్ డేస్ లో కొంత డ్రాప్ వచ్చినప్పటికీ, స్టడీ వర్డ్-ఆఫ్-మౌత్ ట్రాక్షన్‌తో నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, 50 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ లైఫ్‌టైమ్ గ్రాస్ అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
జీతు అష్రఫ్ దర్శకత్వం వహించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ చిత్రం.. ప్రముఖ రచయిత షాహి కబీర్ కలం నుంచి వచ్చింది. కథలోని గాఢత, నటీనటుల పెర్ఫార్మెన్స్, అలాగే మ్యూజిక్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాఖ్ నాయర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. బోబన్, నాయర్ ల పెర్ఫార్మెన్స్ కోసం ప్రత్యేకంగా ప్రశంసలు అందు కుంటోంది.
ఈ సినిమా కథ హరిశంకర్ అనే కఠిన స్వభావం ఉన్న పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతను అనుకోకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా డిమోషన్ అవుతాడు. ఆ సమయంలో నకిలీ బంగారు గొలుసును మోర్గేజ్ పెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి కేసు అతని వద్దకు వస్తుంది. ఈ చిన్న కేసు క్రమంగా ఘోరమైన నేరాలను, అతని గతంలోని విషాదకర ఘటనలతో ముడిపడిన నిజాలను బయటపెడుతుంది. షాకింగ్ ట్విస్టులు, ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాను ఆడియెన్స్‌ను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌కు కట్టిపడేస్తున్నాయి