‘ఇన్నోసెంట్’ గా అల్తాఫ్ సలీం

ఇన్నోసెంట్ సినిమాని ఎలిమెంట్స్ ఆఫ్ సినిమా బ్యానర్‌పై ఎం శ్రీరాజ్ ఎకెడి నిర్మిస్తున్నారు. డిక్సన్ పొతుదాస్, నజ్ముదీన్, దర్శకులు అజయ్ వాసుదేవ్, జి మార్తాండన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.;

By :  K R K
Update: 2025-05-28 01:21 GMT

‘మందాకిని’ నటీనటులు అల్తాఫ్ సలీం అండ్ అనార్కలి మరికర్ నటిస్తున్న కొత్త సినిమాకి ‘ఇన్నోసెంట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సతీష్ థన్వీ తెరకెక్కిస్తున్నారు. కొచ్చిలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. కథను షిహాబ్ కరుణగప్పల్లి రాశారు.

చిత్రంలో అజీస్ నెడుమంగడ్, అన్నా ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇన్నోసెంట్ సినిమాని ఎలిమెంట్స్ ఆఫ్ సినిమా బ్యానర్‌పై ఎం శ్రీరాజ్ ఎకెడి నిర్మిస్తున్నారు. డిక్సన్ పొతుదాస్, నజ్ముదీన్, దర్శకులు అజయ్ వాసుదేవ్, జి మార్తాండన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎర్నాకులం, తిరువనంతపురంలో జరుగుతోంది.

అల్తాఫ్ రాబోయే సినిమాల్లో అనస్ కడలుండి దర్శకత్వం వహిస్తున్న ‘మన్మథన్’ ఒకటి. అలాగే, అతను దర్శకుడిగా తన రెండో చిత్రం ‘ఓడుం కుదిర చాడుం కుదిర’ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఓణం సందర్భంగా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు, అనార్కలి గగనాచారి టీమ్‌తో మళ్లీ కలిసి నటిస్తున్న జోంబీ సినిమా ‘వల’ కూడా రాబోతోంది.

Tags:    

Similar News