ఆమిర్ ఖాన్ సోదరి నిఖత్ హెగ్డే మాలీవుడ్ లోకి అరంగేట్రం !

Update: 2025-02-23 04:50 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సోదరి నిఖత్ హెగ్డే మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా "L2: ఎంపురాన్" లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2019లో ఘనవిజయం సాధించిన "లూసిఫర్" చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పృద్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.





 


చిత్ర బృందం ఇటీవల నిఖత్ హెగ్డే పాత్రను ప్రత్యేక క్యారెక్టర్ రివీల్ వీడియో ద్వారా పరిచయం చేశారు. ఈ వీడియోలో ఆమె తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ అవకాశం తనకు లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. "నమస్తే, నేను నిఖత్ హెగ్డే. ‘ఎంపురాన్’ చిత్రంలో నేను సుభద్రాబెన్ పాత్ర పోషిస్తున్నాను. ఈమె రాజ కుటుంబానికి చెందిన మహిళ, ఒక అద్భుతమైన హవేలీ యజమాని. ఆమె రాచరికపు వైభవం కలిగివుండటమే కాకుండా మానవత్వం కూడా ఎక్కువగా కలిగిన వ్యక్తిత్వం. ఒక సంక్షోభంలో చిక్కుకున్న కొంతమందిని ఆదుకుంటుంది. ఆమె ప్రేమ, సహనానికి చిహ్నంగా నిలుస్తుంది. అయితే, ఈ కథలో ఆమెను కొంతమంది మోసం కూడా చేస్తారు" అని నిఖత్ తెలిపారు.

ఈ చిత్రంలో పనిచేయడం చాలా అద్భుతమైన అనుభవంగా అనిపించిందని నిఖత్ హెగ్డే పేర్కొన్నారు. "సుభద్రాబెన్ పాత్ర ద్వారా నాకు విభిన్నమైన భావోద్వేగాలను అనుభవించే అవకాశం లభించింది. అంతేగాక, ఈ పాత్ర ద్వారా సినిమాలో నేను ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించగలగడం గర్వంగా ఉంది. డైరెక్టర్ పృథ్వీరాజ్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఎంపురాన్ చిత్ర భాగంగా మారడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను" అని ఆమె అన్నారు. నిఖత్ హెగ్డే గతంలో "మిషన్ మంగళ్", "సాండ్ కి ఆంఖ్" చిత్రాల్లో కూడా నటించారు. అయితే, మలయాళ చిత్రసీమలో ఆమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం.

Tags:    

Similar News