‘ఎల్ 2 : ఎంపురాన్’ పై అదిరిపోయే అప్డేట్ !
2019లో విడుదలైన బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఎంపురాన్’ సినిమా పై ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. మోహన్‌లాల్, టోవినో థామస్, మంజు వారియర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో, దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చిత్ర బృందం ఆయన పాత్ర జాయెద్ మసూద్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను పృథ్వీరాజ్ తన సోషల్ మీడియా ద్వారా వీడియో రూపంలో షేర్ చేస్తూ, తన పాత్రపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘లూసిఫర్‌లో, జాయెద్‌ను కేవలం ఖురేషీ అబ్రామ్ అనే అంతర్జాతీయ గోల్డ్ అండ్ డైమండ్ ట్రేడ్ నెట్వర్క్ కమాండోగా మాత్రమే చూశారు. కానీ ఈ పాత్రకు కూడా ఓ గతం ఉంది. అతను ఏ ప్రపంచానికి చెందినవాడు? ఖురేషీ అబ్రామ్‌తో అతనికి ఏ సంబంధం? ఇవన్నీ ఎంపురాన్‌లో వెల్లడవుతాయి." "లూసిఫర్‌లో మీకు ఒక క్లిష్టమైన కథా ప్రపంచాన్ని, అనేక పాత్రల్ని, వారి మధ్య సంబంధాల్ని చూపించాం. అయితే ‘ఎంపురాన్’ లో ఈ స్కేల్ ఇంకా పెరుగుతుంది. మరింత విస్తృతమైన నేపథ్యం ఉంటుంది’. అని తెలిపాడు