మలయాళ చిత్రానికి సరికొత్త నిర్వచనం ‘మచ్చాండే మాలాఖ’

Update: 2025-02-28 03:47 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘మచ్చాండే మాలాఖ’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మాలీవుడ్ లో ఇటీవలి కాలంలో కుటుంబ కథా చిత్రాలు చాలా తక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ చిత్రం మళ్లీ కుటుంబ సంబంధాలు, ప్రేమ, విలువలపై ఆసక్తికరంగా దృష్టి సారించింది.




 


బోబన్ శామ్యూల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలో నటించగా, నమిత ప్రమోద్, ధ్యాన్ శ్రీనివాసన్, లాల్ జోస్, దిలీష్ పోతన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. "మంజుమ్మల్ బాయ్స్" ఘన విజయం తర్వాత, సౌబిన్ మరోసారి తన అసమానమైన అభినయంతో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు.

సినిమా మొదటి భాగం మృదువైన భావోద్వేగాలతో, వినోదంతో సాగే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ అయితే.. రెండో భాగం ప్రేమ, కుటుంబ బంధాలు, న్యాయం వంటి అంశాలను మరింత లోతుగా ఆవిష్కరిస్తూ, నాటకీయ మలుపులు తీసుకుంటుంది. కథనాన్ని నైపుణ్యంగా మలచిన విధానం, పాత్రల మధ్య సహజమైన సంభాషణలు, ముఖ్యంగా సౌబిన్ షాహిర్ , నమిత ప్రమోద్ ల మధ్య కెమిస్ట్రీ, సినిమాను మరింత బలంగా నిలబెడతాయి.

‘మచ్చాండే మాలాఖ’ చిత్రంలో ఉన్న కుటుంబ విలువలు, భావోద్వేగపూరిత దృశ్యాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవుతాయి. నాణ్యమైన నిర్మాణ విలువలు, ఆకర్షణీయమైన కథనంతో, ఈ చిత్రం మలయాళ సినీ ప్రపంచంలో మరో ప్రాముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.

Machande Malakha, Boban Samuel, Soubin Shahir, Namitha Pramod, Dhyan Srinivasan, Lal Jose, Dileesh Pothan, Manjumal Boys,

Tags:    

Similar News