నిర్మాతల సంఘానికి షాకిచ్చిన నటీనటుల సంఘం !

Update: 2025-02-25 03:53 GMT

జూన్ 1  నుండి సమ్మె చేపట్టాలని ‘కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ ‘అమ్మ’ స్పష్టంగా ప్రకటించింది. అయితే, పారితోషిక సమస్యలపై చర్చలు జరపడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కొచ్చీలో అత్యవసరంగా నిర్వహించిన సమావేశంలో, నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ‘అమ్మ’ అంగీకరిస్తుందని, కానీ నటీనటుల వృత్తిపరమైన బాధ్యతలు లేదా చిత్ర నిర్మాణానికి బాహ్య జోక్యం సహించలేమని స్పష్టం చేసింది.

నటీనటుల పారితోషిక సమస్యలు, వాటిని తగ్గించాలనే నిర్మాతల డిమాండ్లపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి మోహన్‌లాల్, సురేష్ గోపీ, మంజు పిల్లై, బాసిల్ జోసఫ్, అన్సిబ, టొవినో థామస్, సాయి కుమార్, విజయరాఘవన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే, ‘కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ తన కార్యనిర్వాహక సమావేశాన్ని రీసెంట్ గా నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాత సురేష్ కుమార్ హాజరవగా, ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ పాల్గొనలేదు. అంతేకాదు, పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు కేరళ ఫిలిం చాంబర్ కూడా కోచ్చిలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.

Tags:    

Similar News