మలయాళంలో కూడా ఓ ‘ఈగ’ వస్తోంది !

Update: 2025-03-11 10:14 GMT

దర్శకధీరుడు రాజమౌళి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్స్ లో ‘ఈగ’ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. చిన్న ప్రాణితో కూడా గొప్ప విజువల్ వండర్ ను తీసి.. ప్రేక్షకులను విస్మయపరిచాడు రాజమౌళి. అప్పటి నుంచీ ఈగ సీక్వెల్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై రాజమౌళి ఎప్పుడూ స్పందించలేదు. ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయిలో ఆయన రేంజ్ ఇప్పుడు స్కై హైలో వెలుగుతోంది.

అసలు మేటర్లోకి వస్తే.. తాజాగా ‘ఈగ’ తరహాలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘లవ్లీ’ అనే ఈ చిత్రం మలయాళంలో రూపొందింది. దిలీష్ కరుణాకరన్ దర్శకత్వంలో మ్యాథ్యూ థామస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో.. ఒక యువకుడికి ఓ ఈగతో స్నేహం ఏర్పడినట్లు చూపించారు. వీరి మధ్య అద్భుతమైన బాండింగ్ ఏర్పడి.. ఆ ఈగ యువకుడికి సలహాలు ఇవ్వడమే కాకుండా.. అతను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తుంది. టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ఈగ సినిమాను గుర్తుకు తెచ్చేలా అత్యున్నత స్థాయిలో రూపొందించబడ్డాయి.

ఈ చిత్రంలో ఉన్నిమాయ ప్రసాద్, మనోజ్ కె జయన్, అశ్వతి రామచంద్రన్, ప్రసాంత్ మురళి, బాబురాజ్, జోయిమోన్ జ్యోతిర్, అరుణ్ ప్రదీప్, శ్రీజిత్ రవి, జయశంకర్, అశ్లిన్, అరుణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "లవ్‌లీ" టీజర్ వినోదం, ఫాంటసీని మేళవించిన చిత్రమని సూచిస్తోంది.

Tags:    

Similar News