'మిరాయ్' రిలీజ్ డేట్ మిస్టరీ
ఈమధ్య కాలంలో రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవ్వడం వెరీ కామన్ గా మారింది. ఒకప్పుడు సినిమా వాయిదా పడితే అది మైనస్ సెంటిమెంట్‌గా భావించేవారు.;
ఈమధ్య కాలంలో రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవ్వడం వెరీ కామన్ గా మారింది. ఒకప్పుడు సినిమా వాయిదా పడితే అది మైనస్ సెంటిమెంట్‌గా భావించేవారు. కానీ కరోనా తర్వాత ఆ ఆలోచన మొత్తం మారిపోయింది. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, భారీ పోటీ, బిజినెస్ లెక్కలు – ఇలా రకరకాల కారణాలతో సినిమాలు వాయిదాలు పడటం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది.
ఇప్పుడు అదే పరిస్థితి యంగ్ హీరో తేజ సజ్జా నటించిన 'మిరాయ్'కి ఎదురవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా వస్తున్న రూమర్ల ప్రకారం సినిమా మరోసారి వాయిదా పడే అవకాశముందట.
ఇప్పటికే 'మిరాయ్' రెండు సార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది. 'హనుమాన్' సూపర్ సక్సెస్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జా ఒక అద్భుతమైన శక్తులున్న యోధుడిగా కనిపించనున్నాడు. మంచు మనోజ్ విలన్‌గా నటించడం మరో హైలైట్. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై బజ్ పెరిగింది.
అయితే ఈసారి 'మిరాయ్' రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వస్తుందా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. కారణం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా – భారీ పోటీ తప్పించుకోవడమే కారణమని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే అదే రోజున అనుష్క శెట్టి – క్రిష్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఘాటి', రష్మిక నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్', తమిళం నుంచి 'మదరాసి' వంటి చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.
ఒకవేళ ఇప్పుడు వాయిదా వేస్తే తర్వాత మంచి డేట్ దొరకదనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్‌లోనే 'ఓజీ, అఖండ 2' వంటి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇంకా.. అక్టోబర్ లోనూ బాక్సాఫీస్ ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తుంది. మరి.. 'మిరాయ్' వాయదా వేస్తారా? వేస్తే మళ్లీ ఎప్పుడు తీసుకొస్తారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.