చిరు-బాబీ అనౌన్స్‌మెంట్
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు వరుస ట్రీట్ లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 'విశ్వంభర' గ్లింప్స్ రాగా.. ఈరోజు ఉదయం అనిల్ రావిపూడి సినిమా మెగా 157 టైటిల్ గ్లింప్స్ వస్తోంది.;
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు వరుస ట్రీట్ లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 'విశ్వంభర' గ్లింప్స్ రాగా.. ఈరోజు ఉదయం అనిల్ రావిపూడి సినిమా మెగా 157 టైటిల్ గ్లింప్స్ వస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవితో బాబీ చేయబోయే రెండో సినిమాకి సంబంధించి అనౌన్స్‌మెంట్ రాబోతుంది.
‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగా, అదే విజయాన్ని కొనసాగించేందుకు చిరంజీవి-బాబీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుండగా, ఈనోజు సాయంత్రం 5:13 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు.
ఈ పోస్టర్ ద్వారా సినిమాకి సంబంధించిన టోన్, జానర్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి స్టైల్, బాబీకి ఉన్న మాస్ టేకింగ్ కలిసినప్పుడు మళ్లీ ఫ్యాన్స్‌కు పండగే అన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.