ఢిల్లీ, రోలెక్స్ కోసం వెయిటింగ్ తప్పదా?

‘ఖైదీ 2’ షూటింగ్ 2026 చివరి వరకూ మొదలుకాదు. అంటే, ఢిల్లీ, రోలెక్స్‌ను స్క్రీన్‌పై చూడాలంటే ఫ్యాన్స్ ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే.;

By :  K R K
Update: 2025-08-22 01:52 GMT

కార్తి నటించిన ‘ఖైదీ’ ఘన విజయం సాధించి.. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను స్టార్ డైరెక్టర్‌గా మార్చింది. ఆ తర్వాత లోకేష్ ‘మాస్టర్, విక్రమ్, లియో, కూలీ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. లోకేష్ డిమాండ్ ఆకాశాన్ని తాకింది. ‘కూలీ’ తర్వాత, లోకేష్ కార్తితో ‘ఖైదీ 2’ తీస్తానని, స్క్రిప్ట్ కూడా రెడీ అని చెప్పాడు. కానీ, అతని ప్లాన్స్ మారాయి.

ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్‌లతో ఒక మల్టీస్టారర్ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. కార్తి ఫ్యాన్స్ ‘ఖైదీ 2’ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై వాళ్లు సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అంతేకాదు.. ‘విక్రమ్’ లో రోలెక్స్ పాత్రలో సర్‌ప్రైజ్ చేసిన సూర్య.. ‘ఖైదీ 2’ లో ఒక ఇంట్రెస్టింగ్ రోల్‌లో కనిపించవచ్చని ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి.

సూర్య, కార్తి ఫ్యాన్స్ ఈ వార్తతో ఫుల్ థ్రిల్‌లో ఉన్నారు. కానీ ‘ఖైదీ 2’ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిందే. తాజా అప్‌డేట్స్ ప్రకారం.. ‘ఖైదీ 2’ షూటింగ్ 2026 చివరి వరకూ మొదలుకాదు. అంటే, ఢిల్లీ, రోలెక్స్‌ను స్క్రీన్‌పై చూడాలంటే ఫ్యాన్స్ ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే.

Tags:    

Similar News