రజనీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్ ?

సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు.;

By :  K R K
Update: 2025-08-21 01:22 GMT

తమిళ సినిమా వర్గాల్లో ఇప్పుడు సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

లోకేష్ కనగరాజ్, ‘కూలీ’ సినిమా విడుదలకు ముందే రజనీకాంత్, కమల్ హాసన్‌లను విడివిడిగా కలిసి స్క్రిప్ట్‌ను వివరించారని, ఇద్దరూ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే, 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి నిర్మించనుంది.

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కార్తీతో ‘ఖైదీ2’ కోసం కట్టుబడి ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. రజనీకాంత్-కమల్ హాసన్ సినిమా గురించి లోకేష్ కనగరాజ్, కార్తీతో మాట్లాడి వివరించారని, ఈ భారీ బడ్జెట్ చిత్రం తర్వాతే ‘ఖైదీ 2’ ప్రారంభమవుతుందని తమిళ మీడియా సమాచారం. 

Tags:    

Similar News