మరో సౌత్ సినిమాలో కూడా నటిస్తున్నాడా?
తాజా ఇండస్ట్రీ గుసగుసల ప్రకారం.. మిథున్ మరో సౌత్ ఇండియన్ బిగ్గీ ‘జైలర్ 2’ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారట.;
బాలీవుడ్ వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి, గతంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ధృవీకరించారు. ఈ చిత్రాన్ని ‘సీతారామం’ సంచలన దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు, తాజా ఇండస్ట్రీ గుసగుసల ప్రకారం.. మిథున్ మరో సౌత్ ఇండియన్ బిగ్గీ ‘జైలర్ 2’ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారట.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ పాత్ర కేవలం కామియో కాదు, పూర్తి స్థాయి రోల్ అని సమాచారం. త్వరలోనే ఆయన షూటింగ్ సెట్స్‌లో చేరనున్నారని బజ్. ‘గోపాలా గోపాలా’ చిత్రం తర్వాత మిథున్ నటిస్తున్న సౌత్ ఇండియన్ మూవీస్ ఇవే అవడం విశేషం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం భారీ అంచనాలతో రూపొందుతోంది.
కూలీ తర్వాత.. అనిరుధ్ రవిచందర్ ఈ స్టార్ హీరో సినిమాకి మరోసారి సంగీతం అందిస్తున్నారు. రమ్య కృష్ణ, శివరాజ్‌కుమార్, మిర్నా మీనన్, యోగి బాబు తమ పాత్రల్లో మళ్లీ కనిపించనున్నారు. అలాగే, ఈ సినిమాలో ఆశ్చర్యకరమైన కామియోలు కూడా ఉండనున్నాయి.