శివశక్తి దత్త గారి ఆత్మకు శాంతి చేకూరాలి
By : Surendra Nalamati
Update: 2025-07-08 04:27 GMT
ప్రముఖ రచయిత శివశక్తి దత్త మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివశక్తి దత్త గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
'ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న శ్రీ దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగంతో బాధపడుతున్న శ్రీ కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.