‘మాస్ జాతర‘ మ్యూజికల్ ఫెస్ట్

మాస్ మహారాజ రవితేజ ‘మాస్ జాతర‘ ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.;

By :  S D R
Update: 2025-08-04 07:08 GMT

మాస్ మహారాజ రవితేజ ‘మాస్ జాతర‘ ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రవితేజాకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక ‘ధమాకా‘ వంటి మ్యూజికల్ హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల, భీమ్స్ కాంబోలో వస్తోన్న ‘మాస్ జాతర‘ పాటల జాతర మొదలైంది.

ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓలే ఓలే‘ అంటూ సాగే గీతం రాబోతుంది. భాస్కర్ యాదవ్ దాసరి రాసిన ఈ పాటను భీమ్స్, రోహిని సోరత్ ఆలపించారు. ఈ పాటకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్సులతో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రోమోలో రవితేజ మార్క్ హుక్ స్టెప్ హైలైట్. రవితేజ, శ్రీలీల ఇద్దరూ ఈ స్టెప్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఫుల్ సాంగ్ ఆగస్టు 5 సాయంత్రం రాబోతుంది.


Full View


Tags:    

Similar News