ఈనెలలోనే హోంబలే 'మహావతార్'

‘కేజీయఫ్, సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు తమ మొట్టమొదటి యానిమేషన్ మూవీతో ప్రేక్షకులను అలరించబోతుంది.;

By :  S D R
Update: 2025-07-11 01:24 GMT

‘కేజీయఫ్, సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు తమ మొట్టమొదటి యానిమేషన్ మూవీతో ప్రేక్షకులను అలరించబోతుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ ఈ జూలై 25న 3డీ ఫార్మాట్‌లో విడుదల కానుంది.

లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ అద్భుత విజువల్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతంతో ఆకట్టుకుంటుంది. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, నరసింహ స్వరూపం వంటి పౌరాణిక ఘట్టాలు యానిమేషన్ రూపంలో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. విష్ణువు అవతారాల వెనుక ఉన్న దైవతత్వాన్ని నేటి తరం ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యం అని హోంబలే చెబుతుంది.

మరోవైపు ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌’ నుంచి ఇకపై వరుస సినిమాలు రానున్నాయి. 'మహావతార్: నరసింహ (2025), మహావతార్: పరశురామ్ (2027), మహావతార్: రఘునందన్ (2029), మహావతార్: ద్వారకాధీశ్ (2031), మహావతార్: గోకులానంద్ (2033), మహావతార్: కల్కి – పార్ట్ 1 (2035), మహావతార్: కల్కి – పార్ట్ 2 (2037)' వంటి వరుస చిత్రాలు రాబోతున్నాయి.


Full View


Tags:    

Similar News