మహాశివరాత్రి కానుక - 'భైరవం థీమ్' సాంగ్ అదిరింది!
Maha Shivaratri Gift - 'Bhairavam Theme' Song Adirindi!మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి మహాశివరాత్రి కానుకగా ముందుగానే 'భైరవం థీమ్' సాంగ్ ను వదిలారు.
శ్రీచరణ్ పాకాల సంగీతంలో చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటకు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తన శక్తిమంతమైన గాత్రంతో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ లిరికల్ వీడియోలో బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతమైన ఎనర్జీతో తాండవం చేసినట్లు కనిపిస్తుంది. ఆలయం ముందు చిత్రీకరించిన ఈ సాంగ్ ఆధ్యాత్మికతకు, శివతత్వానికి అద్దం పట్టేలా ఆకట్టుకుంటుంది.
తమిళ చిత్రం 'గరుడన్' రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, అజయ్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కెకె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది.